టెన్త్ ప్రతిభకు గీటురాయా? గ్రేడుపై పాత పాలసీయేనా?రద్దు నేపథ్యంలో అన్నీ ప్రశ్నలే
టెన్త్ ప్రతిభకు గీటురాయా? గ్రేడుపై పాత పాలసీయేనా? రద్దు నేపథ్యంలో అన్నీ ప్రశ్నలే పదో తరగతి పరీక్షలను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం..మార్కులు, గ్రేడింగులు మాత్రం ఇస్తామని ప్రకటించడం విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిభ ఆధారంగా వీటిని కేటాయిస్తామని చెప్పడంపై విద్యార్థుల్లో ఒకింత ఆసక్తి, మరింత టెన్షన్ కనిపిస్తోంది. అసలు ప్రతిభను ఎలా గుర్తిస్తారంటూ ఉపాధ్యాయులను, విద్యాశాఖ వర్గాలను వారంతా ఆరా తీయడం కనిపించింది. 2019-20 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలోనే అంతర్గతంగా ఫార్మేటివ్ అసె్‌సమెంట్ (ఎఫ్.ఎ), సమ్మేటివ్ అసె్‌సమెంట్ (ఎస్.ఎ), ప్రీ పబ్లిక్ పరీక్షలను నిర్వహించారు. మొత్తం మీద సబ్జెక్టుల వారీగా నాలుగు ఎఫ్.ఎ. పరీక్షలను (ఎఫ్.ఎ.-1, ఎఫ్.ఎ.-2,ఎ్‌ఫ.ఎ.-3, ఎఫ్.ఎ.-4) 50 మార్కులచొప్పున, ఎస్.ఎ.-1 పరీక్షలను 100 మార్కుల చొప్పున, ప్రీఫైనల్ పరీక్షలను 100 మార్కుల చొప్పున నిర్వహించారు. అంటే మొత్తం మీద పదో తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరంలో 400 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహించారన్నమాట. ఈ పరీక్షల్లో సాధించిన మార్కుల సగటును ప్రాతిపదికగా తీసుకుని...టెన్త్ పరీక్...