Fee Regulatory Commission
APPUSMA EGDT
ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ పోర్టల్ లో సమాచారాన్ని నింపడానికి సూచనలు :
ముఖ్య గమనిక:
2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇందులో నింపాలి.
ఒకవేళ వెబ్సైట్ ఓపెన్ కాకపోతే,
1. Different browser ను ఉపయోగించండి. Google Chrome, Mozilla Firefox, Internet Explorer...
2. లేదా అదే బ్రౌజర్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి cache క్లియర్ చేయాలి. (Cache clear చేసే విధానం కోసం యూట్యూబ్ లో వెతకండి)
ఈ సమాచారం నింపడాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు.
1. డేటా మొత్తం నింపడం
2. ఆ తర్వాత జియో ట్యాగింగ్ యాప్ ద్వారా ఫోటోలు తీయడం. ఫైనల్ సబ్మిషన్ చేయడం.
1. డేటా నింపడం - సూచనలు
A. లాగిన్:
* apsermc.ap.gov.in ఓపెన్ చేయండి.
* లాగిన్ నొక్కండి
* యూజర్ ఐడి : పాఠశాల అయితే DISE code, జూనియర్ కళాశాల అయితే కాలేజ్ కోడ్
* పాస్వర్డ్: ఇదివరకే మీరు ఉపయోగిస్తున్న పాస్వర్డ్ తో లాగిన్ కావాలి.
ఒకవేళ పాస్వర్డ్ తప్పు ఉంటే forgot password ఉపయోగించండి. మీరు ఇంతకు మునుపు డైస్ ప్రొఫార్మాలో/ కాలేజ్ ప్రొఫార్మాలో ఇచ్చిన ఫోన్ నెంబర్ కు కొత్త పాస్వర్డ్ వస్తుంది.
B. డేటా నింపడం
* ఇందులో మొత్తం 11 schedules ఉన్నాయి.
* GPS Location, ఫోటోలు ఎక్కడ వచ్చినా ప్రస్తుతానికి వాటిని పట్టించుకోవద్దు.
* అప్ లోడ్ డాక్యుమెంట్ ఉన్న చోట మాత్రమే సంబంధిత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి.
* ఎరుపు చుక్క ఉన్న ఫీల్డ్ తప్పనిసరిగా నింపాలి.
* School basic details, Establishment ఇలా వరుసగా డేటా నింపుతూ వచ్చినప్పుడే తదుపరి షెడ్యూళ్లలో తరగతులు ఓపెన్ అవుతాయి.
* S7 : Asset details : బిల్డింగ్, ఫర్నిచర్ మరియు ఇతర సామగ్రి విలువ ప్రస్తుత విలువను పరిగణనలోకి తీసుకొని నింపాలి.
S 11: declaration details :
Step 1- ముందుగా preview నొక్కండి. మీరు అంతవరకు నింపిన సమాచారం మొత్తం ప్రింట్ తీసుకోవచ్చు. మరొకసారి సరిచూసుకోండి.
Step 2- Download affidavit నొక్కండి. దాన్ని ప్రింట్ తీసుకోండి.
Step 3- దీన్ని నోటరీ దగ్గరకు తీసుకు వెళ్లి notarize చేయాలి.
Step 4- ఇప్పుడు □ I ..... Correspondent of దగ్గర ముందు వైపు ఉన్న బాక్స్ మీద టిక్ చేయాలి.
Step 5: ఇప్పుడు OTP ఎంటర్ చేయండి.
Step 6: నోటరైజ్ చేసిన అఫిడవిట్ ను ఇప్పుడు అప్ లోడ్ చేయండి.
Step 7: మీ డేటా నింపడం మొదటి భాగం పూర్తయింది.
2. రెండవ భాగం: జియో టాగింగ్ యాప్ ద్వారా ఫోటోలు తీయడం.
ముందుగా ప్లే స్టోర్ లోకి వెళ్లి జియో టాగింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
https://play.google.com/store/apps/details?id=in.apcfss.apsermc.schools
యూజర్ ఐడి : పాఠశాల అయితే DISE code, జూనియర్ కళాశాల అయితే కాలేజ్ కోడ్ (పోర్టల్ లాగిన్ లాగే)
యాప్ లోపలికి వెళ్ళిన తర్వాత సంబంధిత ఫోటోలు తీసుకుంటూ వెళ్ళాలి. దీని ద్వారా GPS Location మరియు ఫోటోలు ఆటోమేటిక్ గా పోర్టల్ లోకి వెళ్తాయి.
మొత్తం ఫోటోలు అప్లోడ్ అవగానే,
ఇప్పుడు final submission నొక్కండి.
ఇది పూర్తి అవగానే, మీ పాఠశాలకు సంబంధించిన డేటాను మొత్తం అప్లోడ్ చేసినట్లు అవుతుంది.

Comments
Post a Comment