Posts

ఈసారైనా గ్రేడ్లు ఇవ్వాలంటున్న విద్యార్థులు

Image
 ♦️ఈసారైనా గ్రేడ్లు ఇవ్వాలంటున్న విద్యార్థులు ♦️కొవిడ్‌ పాస్‌’ అని నమోదైతే నిరుపయోగం గత రెండు నెలలుగా పరీక్షలు జరుగుతాయో, లేదో అని ఎదురుచూసిన పది, ఇంటర్‌ విద్యార్థులు, తల్లిదండ్రుల ఉత్కంఠకు తెరపడింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడం కొందరికి ఆమోదయోగ్యంగా ఉండగా.. మరికొందరు విద్యార్థులు మాత్రం బాధపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 57 వేలకు పైగా ఉండగా, ఇంటర్‌ విద్యార్థులు 63 వేల మంది వరకు ఉన్నారు. కరోనా రెండో వేవ్‌ విజృంభిస్తున్న మొదట్లోనే అనేక రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్షాలు, కొంత మంది తల్లిదండ్రులు పరీక్షలు వద్దని తెలిపినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. మొదట్లో మే, జూన్‌లో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తలపెట్టినా కరోనా ప్రభావం తగ్గకపోవటంతో సాధ్యపడలేదు. ఈ మధ్యకాలంలో విద్యాశాఖ పదో తరగతి పరీక్షలకు షెడ్యూల్‌ రూపొందించిందని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కొవిడ్‌ ప్రభావం అంతగా తగ్గకపోవటం, రోజూ 5 వేలపైగా కేసులు నమోదవ్వడంతో కొంత వెనుకడుగు ...

SSC 2020-21 ALERT

Image
  APPUSMA egdt  ప్రధానోపాధ్యాయులకు/ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లకు ముఖ్య ముఖ్య సూచన:- 👉2020-21 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపుకు సంబంధించిన ప్రకటన డిసెంబర్ నెల చివరి వారంలో రావడం జరుగుతుంది.  Date of birth :31/8/2006 కి లోపు వుండాలి. తరువాత వున్న వారికి వయసు మినహాయింపు (age relaxation) సంబందిత అధికారి నుంచి అనుమతి తప్పనిసరి.  👉కనుక మీ మీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు అనగా విద్యార్థి పేరు ఇంటి పేరుతో సహా, తండ్రి పేరు ఇంటి పేరుతో సహా, తల్లి పేరు ఇంటి పేరుతో సహా, పుట్టిన తేదీ, లింగము, మీడియం, ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజెస్ వివరాలు, పుట్టుమచ్చల వివరాలు వంటివి ఎలాంటి తప్పులు లేకుండా CSE సైట్ నందు నమోదు చేయాలి.  👉తల్లిదండ్రుల పేర్ల ముందు కూడా వారి ఇంటి పేరు నమోదు చేయాలి.  👉ఇంటి పేరు తో కలిపి విద్యార్థి/ తండ్రి/ తల్లి పేరు 42 అక్షరాలకు మించి ఉండరాదు. 👉 విద్యార్థుల పాస్ పోర్ట్ సైజు ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే తీయించి స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి ఉంచుకోవాలి.  👉విద్యార్థుల సం...

జగనన్న అమ్మ ఒడి.

Image
  APPUSMA egdt ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం  జగనన్న అమ్మ ఒడి...  ఈ పథకం ద్వారా మన జిల్లాలో సుమారు 3 లక్షల 92 వేల మంది ఏకైక తల్లుల బ్యాంకు ఖాతాలకు పదిహేనువేల రూపాయిల చొప్పున 9 జనవరి 2020 న ప్రభుత్వం నేరుగా జమచేసింది. తిరిగి ఈ మహత్తర కార్యక్రమం 2021 సంవత్సరమునకు గాను 9 జనవరి 2021 న ఆంధ్రప్రదేశ్  గౌరవ ముఖ్యమంత్రివర్యులతో ప్రారంభిచబడుచున్నది... ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వారు ముందస్తుగా మనందరం పూర్తి చేయవలసిన కృత్యములు గురించి వివరించారు... ఆ అంశములను మీకు తెలియజేయుచున్నాము... 👇👇👇👇👇👇👇👇 ✅ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న చైల్డ్ ఇన్ఫో డాటా ఆధారంగానే బాలబాలికల తల్లులు లేదా సంరక్షకులకు అమ్మ ఒడి ప్రోత్సాహకం అందుతుంది. ✅ ఈ సంవత్సరం కూడా చైల్డ్ ఇన్ఫో డాటా తోనే ధృవీకరిస్తారు. ✅ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల అనగా 15-12-2020 సాయంత్రం 5 గంటలలోపు ఖచ్చితంగా అన్ని యాజమాన్య పాఠశాలలు చైల్డ్ ఇన్ఫో డాటా ను అప్డేట్ చేయడం మరియు న్యూ ఎడ...

స్కూళ్ళ లో 10+2 బోధన..

Image
               APPUSMA egdt స్కూళ్ళ లో 10+2 బోధన... వెయ్యి సర్కారు బడులకు కాలేజీ హోదా! క్లస్టర్‌వారీగా ఒక ఇంటర్‌ కాలేజీ ఏర్పాటు  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్‌ క్లాసులను కూడా బోధించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం మండలాల వారీగా కొనసాగుతున్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు ఇబ్బంది కలుగకుండా ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు లేదా మూడు మండలాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి ఒక హైస్కూల్‌లో ఇంటర్‌ తరగతులను నిర్వహించనున్నారు.  జాతీయ విద్యావిధానంలో చేసిన ప్రతిపాదనలను అమలుచేసేలా ఈ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వీలైతే 2021-22 విద్యాసంవత్సరం నుంచి స్కూళ్లకు జూనియర్‌ కాలేజీల హోదా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.  10+2 విధానాన్ని అనుసరించడం వల్ల విద్యార్థుల డ్రాపౌట్స్‌ శాతం గణనీయంగా తగ్గుతుందని, విద్యార్థులంతా ఇంటర్‌ వరకు చదువుకొనే వీలు కలుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.  జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే గ్రామీణప్రాంత విద్యార్థులకు అవకాశాలు మెరుగవు...

ఫీజుల పై ఫిర్యాదుకకు బడిగంట..

Image
                                                      💁‍♀️ఫీజుల పై ఫిర్యాదుకకు బడిగంట.. 🔰నేటి నుంచి పాఠశాలల్లో తనిఖీలు. 🔰ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తున్నదీ లేనిదీ పరిశీలన 🍁విశాఖపట్నం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి):  🔰నగరం, పరిసర ప్రాంతాల్లో సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తున్న 45 పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై విద్యా శాఖ దృష్టిసారించింది. డీఈవో, డిప్యూటీ డీఈవోతోపాటు ఎంఈ వోల నాయకత్వంలో ఏర్పాటైన ఆరు బృందాలు శుక్రవారం నుంచి పాఠశాలలు తనిఖీ చేస్తాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పాఠశాలలు ట్యూషన్‌ ఫీజులో 70 శాతం మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం జీవో కూడా జారీచేసింది. అయితే కొన్ని పాఠశాలల యాజ మాన్యాలు అన్ని ఫీజులను కలిపి ట్యూషన్‌ ఫీజుగా చూపి స్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తనిఖీలు చేయాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూలుపై ఫిర్యాదు కోసం ‘బడిగం...

కొత్త విద్యా విధానం:.. ఆరవ తరగతి నుంచే కోడింగ్

Image
APPUSMA Egdt కొత్త విద్యా విధానం:.. ఆరవ తరగతి నుంచే కోడింగ్ కొత్త విద్యా విధానంలో, బోర్డులో మంచి మార్కుల కోసం విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసే స్వేచ్ఛ ఉంటుంది. అదే సమయంలో, 50 సంవత్సరాల పాఠశాల విద్య నిర్మాణం పూర్తిగా మార్చబడింది. ఇప్పుడు 10 ప్లస్ 2 కు బదులుగా 15 సంవత్సరాలు అవబోతుంది. వీటికి మూడేళ్ల ఫౌండేషన్ దశ ఉంటుంది. ఇందులో మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు చదువులు నేర్పిస్తారు. ఇది ప్రీ-ప్రైమరీ నుంచి రెండవ తరగతి వరకు ఉంటుంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న అంగన్వాడీలను ఉపయోగిస్తారు. దీని కోసం వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. మొదటి నుంచి జ్ఞాన ఆధారిత విద్యకు ప్రాధాన్యత: కొత్త విద్యా విధానంలో పాఠశాల విద్యలో చేసిన మార్పుల గురించి సమాచారం ఇస్తూ పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనితా కార్వాల్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ పద్ధతిలో పాఠశాల పాఠ్యాంశాలను సిద్ధం చేస్తామని చెప్పారు. జ్ఞానం, తర్కం మీద ఆధారపడి చదువులను సిద్ధం చెయ్యనున్నారు. ఆరో తరగతి నుంచే పిల్లలకు కోడింగ్: కొత్త జాతీయ విద్యా విధానంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా విధివిధానాలను ఖరారు చేసింది. వి...

టెన్త్‌ ప్రతిభకు గీటురాయా? గ్రేడుపై పాత పాలసీయేనా?రద్దు నేపథ్యంలో అన్నీ ప్రశ్నలే

Image
  టెన్త్‌ ప్రతిభకు గీటురాయా? గ్రేడుపై పాత పాలసీయేనా? రద్దు నేపథ్యంలో అన్నీ ప్రశ్నలే పదో తరగతి పరీక్షలను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం..మార్కులు, గ్రేడింగులు మాత్రం ఇస్తామని ప్రకటించడం విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిభ ఆధారంగా వీటిని కేటాయిస్తామని చెప్పడంపై విద్యార్థుల్లో ఒకింత ఆసక్తి, మరింత టెన్షన్‌ కనిపిస్తోంది. అసలు ప్రతిభను ఎలా గుర్తిస్తారంటూ ఉపాధ్యాయులను, విద్యాశాఖ వర్గాలను వారంతా ఆరా తీయడం కనిపించింది. 2019-20 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలోనే అంతర్గతంగా ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎఫ్‌.ఎ), సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎస్‌.ఎ), ప్రీ పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించారు. మొత్తం మీద సబ్జెక్టుల వారీగా నాలుగు ఎఫ్‌.ఎ. పరీక్షలను (ఎఫ్‌.ఎ.-1, ఎఫ్‌.ఎ.-2,ఎ్‌ఫ.ఎ.-3, ఎఫ్‌.ఎ.-4) 50 మార్కులచొప్పున, ఎస్‌.ఎ.-1 పరీక్షలను 100 మార్కుల చొప్పున, ప్రీఫైనల్‌ పరీక్షలను 100 మార్కుల చొప్పున నిర్వహించారు. అంటే మొత్తం మీద పదో తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరంలో 400 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహించారన్నమాట. ఈ పరీక్షల్లో సాధించిన మార్కుల సగటును ప్రాతిపదికగా తీసుకుని...టెన్త్‌ పరీక్...