Posts

Showing posts from June, 2021

ఈసారైనా గ్రేడ్లు ఇవ్వాలంటున్న విద్యార్థులు

Image
 ♦️ఈసారైనా గ్రేడ్లు ఇవ్వాలంటున్న విద్యార్థులు ♦️కొవిడ్‌ పాస్‌’ అని నమోదైతే నిరుపయోగం గత రెండు నెలలుగా పరీక్షలు జరుగుతాయో, లేదో అని ఎదురుచూసిన పది, ఇంటర్‌ విద్యార్థులు, తల్లిదండ్రుల ఉత్కంఠకు తెరపడింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడం కొందరికి ఆమోదయోగ్యంగా ఉండగా.. మరికొందరు విద్యార్థులు మాత్రం బాధపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 57 వేలకు పైగా ఉండగా, ఇంటర్‌ విద్యార్థులు 63 వేల మంది వరకు ఉన్నారు. కరోనా రెండో వేవ్‌ విజృంభిస్తున్న మొదట్లోనే అనేక రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్షాలు, కొంత మంది తల్లిదండ్రులు పరీక్షలు వద్దని తెలిపినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. మొదట్లో మే, జూన్‌లో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తలపెట్టినా కరోనా ప్రభావం తగ్గకపోవటంతో సాధ్యపడలేదు. ఈ మధ్యకాలంలో విద్యాశాఖ పదో తరగతి పరీక్షలకు షెడ్యూల్‌ రూపొందించిందని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కొవిడ్‌ ప్రభావం అంతగా తగ్గకపోవటం, రోజూ 5 వేలపైగా కేసులు నమోదవ్వడంతో కొంత వెనుకడుగు ...